Ilaiyaraaja: తెరమీదకు మాస్ట్రో ఇళయరాజా జీవిత కథ.. హీరో ఎవరంటే
ఆయన స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఆయన సంగీతం ఓ సముద్రం అనే చెప్పాలి. అలనాటి సినిమానుంచి ఇప్పటికి ఆయన తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన సంగీతం ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు. సినిమాలు ఫ్లాప్ అయ్యిఉండొచ్చు కానీ ఇళయరాజా సంగీతం ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఆయన స్వరపరిచిన గీతాలు ఇప్పటికి కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర సినిమాగా రానుందని తెలుస్తోంది. దాదాపు 1500 సినిమాలకు సంగీతం అందించారు ఇళయరాజా ..
సినీ ఇండస్ట్రీ సంగీత సామ్రాట్ గా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్ట్రో ఇళయరాజా గురించే.. ఆయన స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఆయన సంగీతం ఓ సముద్రం అనే చెప్పాలి. అలనాటి సినిమానుంచి ఇప్పటికి ఆయన తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఆయన సంగీతం ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు. సినిమాలు ఫ్లాప్ అయ్యిఉండొచ్చు కానీ ఇళయరాజా సంగీతం ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఆయన స్వరపరిచిన గీతాలు ఇప్పటికి కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర సినిమాగా రానుందని తెలుస్తోంది. తెర వెనక సంగీతంతో సినిమాకు ప్రాణం పొసే ఇళయరాజా జీవిత కథ ఇప్పుడు తెరపైకి రానుంది. దాదాపు 1500 సినిమాలకు సంగీతం అందించారు ఇళయరాజా . బాలీవుడ్ దర్శకుడు డైరెక్టర్ బాల్కీ ఇప్పుడు ఆయన జీవితకథను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
బాలీవుడ్ లో సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ బాల్కీ ఇప్పుడు ఇళయ రాజా బయోపిక్ తీస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆయన సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయనున్నారట. ఇక ఈ సినిమాలో ఇళయరాజా పాత్ర పోషించే నటుడిగి గురించి కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఇళయరాజా బయోపిక్ లో హీరోగా ధనుష్ నటిస్తున్నుడని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు బాల్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కించాలని అనుకుంటున్నా. ఆ సినిమాలో హీరోగా ధనుష్ చేయాలనీ ఆశపడుతున్నా.. అని అన్నారు. అలాగే ధనుష్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు బాల్కీ. ధనుష్ హీరోగానే కాకుండా సింగర్ గా లిరిక్ రైటర్ గానూ తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ధనుష్ అయితేనే ఇళయరాజా సినిమాకు కరెక్ట్ గా సూట్ అవుతారని చెప్పుకొచ్చారు బాల్కీ. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే డీ 50 లోనూ నటిస్తున్నారు. ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.
Ilayaraja Danush