
బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్. తన నటనతోనే కాదు అందంతోనూ కవ్వించింది శ్రద్దా కపూర్. ఇక బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఇక ఈ సినిమా హిందీలో సంచలన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత శ్రద్దా కపూర్ తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది.
ఇదిలా ఉంటే ఈ చిన్నదాని పెళ్లి గురించి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ చిన్నది అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించింది. తాజాగా శ్రద్దా రాహుల్ మోదీతో కలిసి కనిపించింది. జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్‌తో కలిసి శ్రద్ధా కనిపించింది. దాంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ రాహుల్ ఎవరా అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు.
రాహుల్, శ్రద్ధా డేటింగ్‌లో ఉన్నారని గత కొన్ని నెలలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. శ్రద్దా కాపుర్ ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తో శ్రద్దా కాపుర్ డేటింగ్ లో ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా శ్రద్దా కాపుర్ తో ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రేయాస్ కంటే శ్రద్దా కాపుర్ పెద్దది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.