ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు పట్టగలరా.! ఆమెను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడా.?

|

Mar 05, 2021 | 9:36 PM

Jasprit Bumrah News: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెళ్లి కారణంగా..

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు పట్టగలరా.! ఆమెను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడా.?
Follow us on

Jasprit Bumrah News: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. పెళ్లి కారణంగా అతడు ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా తన సొంతూరు గుజరాత్‌లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించినట్లు న్యూస్ మీడియా ఏఎన్ఐ స్పష్టం చేసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్.

బుమ్రా, అనుపమను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు కూడా కారణం లేకపోలేదు. అనుపమ గుజరాత్‌కు వెళ్లడం.. అందుకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వదంతులు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

కాగా, గతంలో బుమ్రా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుపమ బహిరంగంగానే చెప్పింది. అలాగే ఇన్‌స్టాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ అనుపమ. అయితే ఇప్పటిదాకా వీరిద్దరూ కలిసి తిరిగినట్లు ఏ ఫోటోనూ బయటికి రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి వార్తలే నెట్టింట్లో గుప్పుమనడంతో ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Also Read:

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

1972 తర్వాత అదే మొదటిసారి.. క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే.. ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి..!

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!