
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాతో రణ్‌వీర్ సింగ్ కు ఎంత మంచి పేరొచ్చిందో విలన్ గా అక్షయ్ ఖన్నాకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. కొన్ని సీన్లలో అయితే రణ్ వీర్ కంటే అక్షయ్ ఖన్నానే బాగా నటించాడని ప్రశంసలు వచ్చాయి. రెహమాన్ డకైట్ పాత్రలో ఈ బాలీవుడ్ నటుడి ఒదిగిపోయాడని విమర్శకులు తెగ పొగిడేశారు. కాగా ధురంధర్ పార్ట్ 1లో అక్షయ్ పాత్ర చనిపోతుంది. కానీ ఈ రోల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సెకెండ్ పార్ట్ లో రెహ్మాన్ డకైట్ పాత్రను మళ్లీ బతికించవచ్చని ప్రచారం జరుగుతోంది.
అయితే ధురంధర్ సినిమాలో విలన్ గా అక్షయ్ ఖన్నా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ క్యారక్టర్ కోసం మూవీ మేకర్స్ ముందుగా మన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను సంప్రదించారట. కథ కూడా విని బాగా ఉందన్నారట. అయితే అప్పటికే నాగ్ కూలీ, కుబేర చిత్రాల్లో బిజీగా ఉండడంతో ధురంధర్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. దీంతో ధురందర్ మేకర్స్ అక్షయ్ ఖన్నాను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఒకవేళ నాగార్జున ధురంధర్ సినిమా చేసి ఉండుంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Many films will come and go but #Dhurandhar will still rule the box office 😮💨🔥
Can’t imagine Part 2 opening 🤯
— Ayyappan (@Ayyappan_1504) January 17, 2026
#Dhurandhar is heading towards the ₹ 875 cr milestone this weekend… With new releases not posing strong competition, #Dhurandhar continues its supremacy at the boxoffice.
⭐️ #Dhurandhar [Week 7] Fri 2.10 cr. Total: ₹ 871.90 cr.#India biz | Official Nett BOC | #Boxoffice pic.twitter.com/HVvaOkOEhs
— taran adarsh (@taran_adarsh) January 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి