యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. భయమంటే ఏంటో తెలియని మనుషులను భయపెట్టే వ్యక్తి చుట్టూ ఈ స్టోరీ ఉండబోతుందని గతంలోనే డైరెక్టర్ చెప్పేశారు. ఈ సినిమా తర్వాత తారక్.. అటు హిందీలో వార్ 2 చిత్రం చేయనున్నారు. ఇందులో హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు తారక్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 90 రోజుల వరకు కాల్ షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్, తారక్ కలిసి నటించబోయే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
మరోవైపు తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే ప్రాజెక్ట్. నిజానికి కొరటాల శివతో ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే… ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ అనుహ్యంగా వార్ 2 రావడంతో ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేయనున్నారని టాక్. ఈ మూవీ స్ట్క్రిప్ట్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదట
తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఎక్కువగా విదేశాలలో తెరకెక్కించనున్నారని.. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అనంతరం ప్రశాంత్ నీల్ నెలరోజులపాటు విదేశాలకు వెళ్లి.. అక్కడ లొకేషన్స్ చూసుకుంటూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట.. ఈ సినిమాను తారక్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.