
‘యాటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. చంద్రహాస్ పాడిన ఒక బూతు పాట కారణంగా నెగెటివ్ బజ్ తోనే ఈ సినిమా విడుదలైంది. అయితే ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రివ్యూలు కూడా దాదాపు పాజిటివ్ గానే వచ్చాయి. హీరో, హీరోయిన్లు చాలా బాగున్నారని, క్లైమాక్స్ అద్బుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సంపత్ రుద్ర తెరకెక్కించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాలో చంద్రహాస్ సరసన మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. అలాగే బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో అర్జున్ మహి నటించాడు. హీరో, హీరోయిన్లకు పోటీగా తన యాక్టింగ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ నిలిచాడు..
సినిమాలో చంద్రహాస్, అర్జున్ మహి మధ్య వచ్చే సన్నివేశాలు.. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు బాగా హైలెట్ అయ్యాయని ఆడియెన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా అర్జున్ మహి నటనకు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. కాగా గతంలో ఇష్టంగా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ మహి. ఆ తర్వాత ఎంజాయ్, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ సినిమాల్లోనూ కథానాయకుడిగా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా 15 కిలోలు కూడా పెరిగి మరీ బరాబర్ ప్రేమిస్తే సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాతో అర్జున్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
బరాబర్ ప్రేమిస్తా తర్వాత మరో రెండు కొత్త సినిమాలను ఓకే చేసాడు అర్జున్ మహి. త్వరలోనే ఈ చిత్రాలు పట్టాలెక్కనున్నాయి. మొత్తానికి ఓ వైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు మంచి కథలు దొరికితే విలన్ గా చేసేందుకు కూడా రెడీ అంటున్నాడు అర్జున్ మహి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి