The Raja Saab: వైజాగ్‌లో పుట్టి.. స్టార్ నటి రేంజ్‌కు.. ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ నానమ్మ బ్యాక్ గ్రౌండ్ ఇదే

శనివారం జరిగిన ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒకరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.. ' ఈ సినిమా నాన్నమ్మ, మనవడి కథ అని, నేను కాదు ఆమె కూడా ఈ సినిమాలో హీరోనే' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ నటి ఎవరనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

The Raja Saab: వైజాగ్‌లో పుట్టి.. స్టార్ నటి రేంజ్‌కు.. ది రాజా సాబ్లో ప్రభాస్ నానమ్మ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Zarina Wahab, Prabhas

Updated on: Dec 28, 2025 | 5:29 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 28) అట్టహాసంగా జరిగింది. హీరో ప్రభాస్ తో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. ఈ సినిమా ఈవెంట్ లో ప్రభాస్ ఒక నటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.’ ఇది నానమ్మ, మనవడి కథ. నేను కాదు ఆమె కూడా ఈ సినిమాలో హీరోనే’ అంటూ డార్లింగ్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇంతకీ ఆమె ఎవరు ? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ కి నానమ్మగా నటించిన ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వాహబ్. హిందీతో పాటు తెలుగు, తమిళ్ చిత్రాల్లోనూ ఈమె నటించారు. అన్నట్లు జరీనా వాహబ్ ది మన వైజాగే. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆమె సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు.

 

ఇవి కూడా చదవండి

మొదటిసారి 1974లో ఇష్క్.. ఇష్క్.. ఇష్క్ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జరీనా వాహబ్. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా మంచి విజయం సాధించడంతో జరీనాకు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాప్ నటిగా పాపులర్ అయ్యారు. జరీనా తెలుగు సినిమాల్లోనూ నటించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన గాజుల కిష్టయ్య సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు జరీనా. ఆ తరువాత ఆమె అమర ప్రేమ, హేమా హేమీలు తదితర సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. రీసెంట్ టైమ్ లో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, విరాటపర్వం, దసరా, దేవర, విశ్వరూపం వంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారీ సీనియర్ నటి.

ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తో జరీనా వాహబ్..

జరీనా వాహబ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1986లో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీని వివాహం చేసుకున్నారీ అందాల తార. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరు కూడా సినిమాల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.