
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగాస్టార్ పవరేంటో మరోసారి ప్రూవ్ చేసింది. కాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. అలాగే చిరంజీవి పిల్లలుగా ఇద్దరు చిన్నారులు కనిపిస్తారు. అందులో కుమారుడు విక్కీ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా సక్సెట్ మీట్ కార్యక్రమంలో విక్కీ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. మెగాస్టార్ సినిమాలో విక్కీ పాత్రలో కనిపించింది అబ్బాయి కాదు అమ్మాయి. తన పేరు ఊహ. ఈ విషయాన్ని అనిల్ రావిపూడినే స్వయంగా అందరికీ తెలియజేశారు.
‘అబ్బాయి పాత్రలో ఊహ అద్భుతంగా నటించింది .సాధారణంగా అమ్మాయిలకు జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ ఈ పాత్ర కోసం ఊహా తన జుట్టును కూడా కత్తిరించుకొని ఈ సినిమాలో నటించింది’ అంటూ చిన్నారి ఊహపై ప్రశంసలు కురిపించారు అనిల్ రావిపూడి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఊహ విషయానికి వస్తే.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’లో చిరంజీవికి కుమారుడిగా నటించి మెప్పింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఊహా చిరంజీవితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ మురిసిపోయింది. షూటింగ్ సెట్‌లో చిరంజీవి తనను చాలా ప్రేమగా చూసుకున్నారంటూ ముద్దు ముద్దు మాటలు చెప్పింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.