Guntur Kaaram: దేవుడా..! మహేష్‌ బాబుతో రమ్యకృష్ణ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

బాహుబలి సినిమా రమ్యకృష్ణ ను మరోసారి ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించారు. ఆమె తప్ప ఆ పాత్ర మరొకరు చేయలేరు అన్నట్టుగా అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. హీరోలకు అమ్మ పాత్రల్లో అత్తా పాత్రల్లో ఆమె నటిస్తున్నారు.

Guntur Kaaram: దేవుడా..! మహేష్‌ బాబుతో రమ్యకృష్ణ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
Mahesh Babu, Ramyakrishna

Updated on: Jan 12, 2024 | 12:53 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగానటించారు రమ్యకృష్ణ. అప్పట్లో తన నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. బాహుబలి సినిమా రమ్యకృష్ణ ను మరోసారి ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించారు. ఆమె తప్ప ఆ పాత్ర మరొకరు చేయలేరు అన్నట్టుగా అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. హీరోలకు అమ్మ పాత్రల్లో అత్తా పాత్రల్లో ఆమె నటిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలోనూ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు.

అయితే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన నాని సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించారు. నాని సినిమాలో రమ్య కృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. మహేష్ తో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ లో స్టెప్పులేశారు రమ్య కృష్ణ. ఇక ఇప్పుడు మహేష్ బాబుకు తల్లిగా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ నటించారు.

ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో ఆమె కనిపించారు. గుంటూరు కారం సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తుంది. మొదటి షో నుంచి గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.