Imanvi Esmail: అమ్మో ఇమాన్వి.. ప్రభాస్ హీరోయిన్ జోరు మామూలుగా లేదుగా..!

| Edited By: Janardhan Veluru

Jan 10, 2025 | 6:33 PM

Imanvi Esmail Movies: ఎప్పుడొచ్చాం అన్నది కాదు.. ఎంత స్పీడ్‌గా దూసుకుపోతున్నాం అనేది ఇంపార్టెంట్ అంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్లు. అందుకే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే అన్ని ఇండస్ట్రీల్లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. మొన్నటికి మొన్న భాగ్యశ్రీ బోర్సే ఇదే చేసింది. ఇప్పుడు ఈమెకు చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ కూడా ఇలాగే మాయ చేస్తుంది.

Imanvi Esmail: అమ్మో ఇమాన్వి.. ప్రభాస్ హీరోయిన్ జోరు మామూలుగా లేదుగా..!
Imanvi Esmail
Follow us on

ఇమాన్వి.. ఇమాన్వి ఇస్మాయిల్.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. రాబోయే రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా.. ఎంత స్పీడ్‌గా దూసుకుపోతున్నాం అనేది ఇంపార్టెంట్ అంటున్నారు ఈ జనరేషన్ హీరోయిన్లు. అందుకే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే అన్ని ఇండస్ట్రీల్లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. మొన్నటికి మొన్న భాగ్యశ్రీ బోర్సే ఇదే చేసింది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా కూడా ఈమెకు చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోలతో నటిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాగే మాయ చేస్తుంది. ఆమెవరో కాదు.. ఇమాన్వి ఇస్మాయిల్.

ఎవరీ అమ్మాయి ఎక్కడా పేరు కూడా విన్నట్లు లేదే అనుకుంటున్నారేమో..? అందుకే చెప్తున్నాం పేరు గుర్తు పెట్టుకోండి తర్వాత మాట్లాడుకునే పేరు అవుతుందని..! ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. ఎక్కడో ఫారెన్‌లో రీల్స్ చేసుకునే ఈ అమ్మాయి అనుకోకుండా తన డ్యాన్స్ ట్యాలెంట్‌తో హను రాఘవపూడి కంట పడింది.. దాంతో దెబ్బకు జాతకం మారిపోయింది. ప్రస్తుతం ఫౌజీలో నటిస్తున్న ఈ బ్యూటీకి.. ఇది సెట్స్‌పై ఉండగానే మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రభాస్‌ మూవీలో హీరోయిన్‌గా ఇమాన్వి..

మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఇమాన్వికి పిలుపు అందుతుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఆషికి 3లో ఇమాన్విని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ముందుగా ఇందులో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రిని హీరోయిన్ అనుకున్నారు కానీ తాజాగా ఆమెను తప్పించి ఇమాన్వి వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అమ్మడి జాతకం మారిపోయినట్లే. ఎందుకంటే ఫౌజీ విడుదలైన తర్వాత ఎలాగూ ఇమాన్వి పేరు మార్మోగడం ఖాయం. హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్ కారెక్టర్స్ అంత బాగుంటాయి మరి..!

Also Read: ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమంలో తళుక్కుమన్న ఇమాన్వీ ఎవరో తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే