‘ప్రసాద్ స్టూడియోస్’​ డైరెక్టర్​పై కేసు పెట్టిన ఇళయారాజా

|

Aug 01, 2020 | 7:53 AM

ప్ర‌ఖ్యాత మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళయరాజా.. ప్రసాద్ స్టూడియోస్ డైరెక్టర్​పై పోలీస్ కేసు పెట్టారు. అతడితో పాటు అక్క‌డి స్టాఫ్ తాను పని చేస్తుంటే ఇబ్బందులు పెడుతున్నార‌ని చెన్నై కమీషనర్​కు కంప్లైంట్ చేశారు.

ప్రసాద్ స్టూడియోస్​ డైరెక్టర్​పై కేసు పెట్టిన ఇళయారాజా
Follow us on

Ilayaraja`s complaint on Prasad studios : ప్ర‌ఖ్యాత  మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళయరాజా.. ప్రసాద్ స్టూడియోస్ డైరెక్టర్​పై పోలీస్ కేసు పెట్టారు. అతడితో పాటు అక్క‌డి స్టాఫ్ తాను పని చేస్తుంటే ఇబ్బందులు పెడుతున్నార‌ని చెన్నై కమీషనర్​కు కంప్లైంట్ చేశారు. ప్రసాద్ స్టూడియోస్​లో ఓ స్టూడియోను రెంట్ కు తీసుకుని, దాదాపు 40 ఏళ్ల నుంచి అక్క‌డే వ‌ర్క్ చేసుకుంటున్నారు ఇళయరాజా. ఎన్నో చిత్రాల‌కు పాటలు రికార్డింగ్​లు అక్కడే చేశారు. అలాంటిది ఇప్పుడు స్టూడియోస్​ డైరెక్టర్​గా ఉన్న ఎల్​వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నార‌ని ఇళయరాజా వాపోయారు. తన సంగీత వాయిద్యాలు కొన్నింటిని విరగ్గొట్టారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక‌ తన స్టూడియోను ఆక్రమించేందుకు సాయిప్రసాద్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌ని ఇళయారాజా ఆరోపించారు. ఈ విషయమై వెంట‌నే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 1976 నుంచి సినిమాల‌కు సంగీతమందిస్తున్న ఇళయరాజా.. 1300కు పైగా సినిమాల్లో 7000 పాటలకు పైగా బాణీలు అందించారు. ఇందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పాటలు ఉన్నాయి. ఇదే విష‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య గ‌తంలోనూ ప‌లుమార్లు విబేధాలు త‌లెత్తాయి.

 

Read More : ‘బిగ్​బాస్ 4’ వీక్ష‌కుల‌కు గుడ్ న్యూస్..సూప‌ర్ అప్ డేట్