గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.. ఆ స్టార్ హీరోకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్‌గా ఇచ్చారట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశారు పవన్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్నారు.

గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.. ఆ స్టార్ హీరోకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్‌గా ఇచ్చారట
Gudumba Shankar

Updated on: Sep 27, 2026 | 11:21 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో ఆయన సృష్టించిన ట్రెండ్స్, స్టైల్, మ్యానరిజం ఇప్పటికీ అభిమానుల్లో ప్రత్యేకమైన జోష్‌ను నింపుతుంటాయి. ప్రస్తుతం రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. వాటిలో కథ, పాటలు, యాక్షన్ మాత్రమే కాకుండా.. పవన్ ధరించిన కాస్ట్యూమ్స్ కూడా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి గుడుంబా శంకర్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు అప్పట్లో ఓ ప్రత్యేకమైన ట్రెండ్‌కు తెరతీసింది. ముఖ్యంగా ఆయన వేసుకున్న డిఫరెంట్ స్టైల్ ప్యాంట్స్ అప్పట్లో యువతలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా ఒక ప్యాంట్‌పై మరో ప్యాంట్ ధరించే ఆ స్టైల్ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. పవన్ తనదైన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో ఆ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేశారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

గుడుంబా శంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి తన కాస్ట్యూమ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్న సినిమా బాలు. ఈ సినిమాలోనూ ఆయన ధరించిన కొన్ని డిఫరెంట్ డిజైన్ ప్యాంట్స్ అప్పట్లో యువతలో బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు వాటిని ఫాలో అవ్వడానికి ఆసక్తి చూపించడంతో ఆ స్టైల్‌కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అప్పట్లో పవన్ ధరించిన ఆ ప్యాంట్స్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ స్టైల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన కొన్ని వస్తువులను కుటుంబ సభ్యులకు ఇచ్చేవారని సినీ వర్గాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తుంటాయి. అదే తరహాలో గుడుంబా శంకర్ సినిమాలో తాను ఉపయోగించిన ప్యాంట్స్‌ను తన మేనల్లుడు, మెగా హీరో సాయి దుర్గ తేజ్‌కు పవన్ కళ్యాణ్ గిఫ్ట్‌గా ఇచ్చారనే విషయం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

అంతేకాదు.. సాయి దుర్గ తేజ్ తన హీరోగా పరిచయమైన ‘రేయ్’ సినిమాలో ఆ ప్యాంట్స్‌ను ఉపయోగించారు. అయితే రేయ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ విషయం అప్పట్లో పెద్దగా హైలైట్ కాలేదు. పవన్ కళ్యాణ్ ధరించిన కాస్ట్యూమ్‌ను ఆయన మేనల్లుడు తన తొలి సినిమాలో ఉపయోగించాడనే విషయం మాత్రం మెగా అభిమానులకు ఆసక్తికరమైన విషయంగానే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కథతో పాటు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన సినిమాలో కనిపించిన హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అప్పట్లో యువతలో ట్రెండ్‌గా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us