Pushpa The Rise : స్టైలిష్ సినిమాలకు.. ట్రెండీ ఫ్యాషెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బన్నీ ప్రస్తుతం ఎందుకు రిస్క్ చేస్తున్నారు. బెంజ్, ఆడి కార్లను వదిలి.. లారీల వెంట ఎందుకు పరిగెడుతున్నాడు. ఇంటి పక్కనే ఉన్న స్టూడియోల్లో షూట్ పెట్టుకోకుండా అడవుల్లో నరకయాతన ఎందుకు పడుతున్నారు. బురదనే మేకప్ గా ఎందుకు రాసుకుంటున్నారు. పాన్ ఇండియా ముందుకు పుష్ప రాజ్ గెటప్‌లో ఎందుకు పోతున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు గురించి ఆలోచిస్తున్నారు బన్నీ.. నాన్ బన్నీ ఫ్యాన్స్ . అయితే ప్రశ్నల పరిస్థితి అలా ఉంచితే.. బన్నీ ఎంతైనా రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా కోసం బన్నీ ఎంత కష్టమైనా పడతాడు. ఇది అందరి దర్శకుల మాట.
ఇదిలా ఉంటే పుష్ప సినిమా అడవిలో సాగే కథే అంటూ షూట్ ముందుగానే హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఫస్ట్ పోస్టర్ నుంచి సినిమా ఎలా ఉండబోతుందో.. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో క్లారిటీగా వెళ్లిన అన్ని వేదికల మీద చెబుతూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. సుకుమార్ చెప్పే ప్రయత్నమే చేశారు కానీ… బన్నీ దాన్ని నిజం చేసి చూపించారు. సుక్కు ఊహల్లో పుట్టుకొచ్చిన క్యారెక్టర్ కు తగ్గట్టుగా తనను తాను మలుచుకుని మరీ సినిమా కోసం కష్ట పడ్డారు. రింగు రింగుల చింపిరి జుత్తుతో.. మాసిపోయిన భారీ గడ్డంతో.. డిఫరెంట్ బాడీ లాగ్వేజ్‌తో కష్టపడ్డారు అల్లు. కష్ట పడడమే కాదు.. రస్టీ అండ్ రగడ్ లుక్లో కనిపించేందుకు ప్రతీ రోజు రెండు గంటల పాటు మేకప్ కోసమే కేటాయించేవారు. అంతేకాదు కార్లు, బండ్లు పోని మారేడుమిల్లి అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లి మరీ షూటింగ్‌లో పాల్గొన్నారు బన్నీ. ఇప్పటికే స్టైలిష్ అనే ట్యాగ్ ఉండడం.. దానికి తగ్గట్టే స్టైలిష్ గా ఉండడం.. రీసెంట్ ఫిల్మ్ అల వైకుంఠ పురం సినిమా రికార్డు బద్దలు కొట్టడం.. విపరీతమైన క్రేజ్ ఉండడం.. అయినా కూడా బన్నీ ఇలాంటి క్యారెక్టర్ ను ప్లే చేయడానికి ముందుకు రావడం…అందులోనూ ఇలాంటి రస్టీ లుక్‌లో రా సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ముందు వెళ్లడం డేరింగ్ స్టెప్పే అంటున్నారు సినీ విశ్లేషలకులు. ఏది ఏమైనా రేపు ( 17న ) బన్నీ మాస్ మసాలా ట్రీట్ ను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారంటున్నారు చిత్రయూనిట్.
మరిన్ని ఇక్కడ చదవండి :