ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీకి ఫ్యాన్స్ ఉండరు.. ఆర్మీ ఉంటుంది. ఇటీవల జరిగిన మాసీవ్ ప్రీ రిలీజ్ పార్టీకి వచ్చిన క్రౌడ్ చూస్తేనే ఆ ఆర్మీ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఈ పార్టీ అయిన నెక్ట్స్ డే బన్నీ తన ఫ్యాన్స్ కోసం మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఫోటో సెషన్ కూడా ఉంటుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రూప్స్‌కు మెసేజీలు వెళ్లాయి. ఇందుకోసం N కన్వెన్షన్ సెంటర్ ఎంపిక చేశారు. పాస్‌లు కూడా పంచిపెట్టారు. అయితే అభిమానులు భారీగా పోటెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. పోలీసులు ఎంటరయ్యి.. స్వల్ప లాఠీచర్జ్ కూడా చేశారు. తోపులాట జరగడంతో N కన్వెన్షన్ సెంటర్ అద్దం పగిలిపోయింది. పలువురు అభిమానులు కూడా గాయపడ్డారు.
భారీగా తోపులాట చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్‌తో ఫోటో సెషన్‌ను అల్లు అర్జున్ రద్దు చేసుకొన్నారు. అయితే ఇంతలా ఆశపెట్టుకుంటే బన్నీ అక్కడకు రాకపోగా.. పోలీసులు కొట్టడంతో చాలామంది ఫ్యాన్స్ హర్టయ్యారు. ఇలా అభిమానుల కార్యక్రమం గందరగోళం కావడంపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. ఇకపై జాగ్రత్తగా ఉంటానని తన అభిమానులకు హామీ ఇచ్చాడు. అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి తెలిసి.. బాధ కలిగిందని.. తన టీమ్ పరస్థితిని పర్యవేక్షిస్తుందని తెలిపాడు. ఫ్యాన్స్ ప్రేమ, అభిమానం.. తనకున్న అతిపెద్ద ఆస్తి అని.. ఇకపై, అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటాని బన్నీ నోట్ విడుదల చేశాడు.
ఈవెంట్ నిర్వాహకులు కేవలం 200 మంది వ్యక్తులకు మాత్రమే పోలీసు అనుమతి తీసుకున్నారు కానీ, దాదాపు 2,000 మందికి పాస్‌లు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Omicron variant: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. హైదరాబాద్‌లో 2 యాక్టివ్ కేసులు
ఎవరైనా గుర్తించారా ఈ నడిచే నక్షత్రాన్ని.. చిన్నారి ఎదురుగా ఉన్న స్టార్ ఎవరో కనిపెట్టండి..?