అలాంటి అమ్మాయినే సందీప్​ పెళ్లి చేసుకుంటాడ‌ట‌…

టాలీవుడ్ లో లాక్ డౌన్ సీజ‌న్ పెళ్లిళ్ల సీజ‌న్ గా మారిపోయింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్, కమెడియ‌న్ మ‌హేశ్ ఆచంట భాగ‌స్వాముల‌ను జీవితాల్లోకి ఆహ్వానించారు.

అలాంటి అమ్మాయినే సందీప్​ పెళ్లి చేసుకుంటాడ‌ట‌...

Updated on: Jun 18, 2020 | 9:21 AM

టాలీవుడ్ లో లాక్ డౌన్ సీజ‌న్ పెళ్లిళ్ల సీజ‌న్ గా మారిపోయింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్, కమెడియ‌న్ మ‌హేశ్ ఆచంట భాగ‌స్వాముల‌ను జీవితాల్లోకి ఆహ్వానించారు. ఇక త్వ‌ర‌లోనే రానా, నితిన్ వివాహా బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ద‌మవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో మిగిలిన బ్యాచిల‌ర్ హీరోల వైపు ఆడియెన్స్ ఫోక‌స్ మ‌ళ్లింది. ప్ర‌భాస్ లాంటి వాళ్ల‌ను పెళ్లెప్పుడు అన్న‌ ప్ర‌శ్న అడిగితే టైమ్ వ‌చ్చిన‌ప్పుడు అన‌డ‌మో… లేదా ఓ ఓర న‌వ్వు న‌వ్వి స‌మ‌ధానం దాట‌వేయ‌డ‌మో చేస్తున్నారు. కాగా పెళ్లి విష‌యంపై టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజాగా స్పందించాడు.

కొన్ని లక్షణాలు చెప్పి, అటువంటి అమ్మాయి తార‌సప‌డితే వెంట‌నే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. ఇందులో భాగంగా యాక్టీవ్ నెస్, తెలివి, స్ట్రాంగ్, స్ఫూర్తినిచ్చే తత్వం కలగలపిన లక్షణాలు ఉన్న యువతినే త‌న అర్థాంగి చేసుకోవాలనుకుంటున్న‌ట్లు సందీప్ చెప్పుకొచ్చాడు.’రామకృష్ణ తెనాలి బి.ఏ.బి ఎల్’ చిత్రంతో గతేడాది ప్రేక్ష‌కుల ముందుకు సందీప్.. ప్రజంట్ ‘ఏ వన్ ఎక్స్​ప్రెస్’ అనే హాకీ నేపథ్య కథలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా లావణ్య త్రిపాఠి న‌టిస్తోంది. నూత‌న ద‌ర్శ‌కుడు డెన్నీస్ జీవన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.