I Bomma Ravi: అఫీషియల్.. తెరపైకి ఐ బొమ్మ రవి బయోపిక్.. టైటిల్ పోస్టర్ కూడా వచ్చేసింది.. హీరో ఎవరంటే?

ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి జీవితం ఆధారంగా ఓ సినిమా రానుందనే ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడది నిజమైంది. ఈ పైరసీ కింగ్ పిన్ బయోపిక్ అధికారికంగా ప్రారంభమైంది. ఏకంగా టైటిల్ పోస్టర్ కూడా రిలీజైంది.

I Bomma Ravi: అఫీషియల్.. తెరపైకి ఐ బొమ్మ రవి బయోపిక్.. టైటిల్ పోస్టర్ కూడా వచ్చేసింది.. హీరో ఎవరంటే?
I Bomma Ravi Biopic

Updated on: Nov 27, 2025 | 6:45 AM

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పేరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ అతని పేరు తెగ వినిపిస్తోంది. ఐ బొమ్మ, బప్పం టీవీ అంటూ పదుల సంఖ్యలో పైరసీ వెబ్ సైట్లు క్రియేట్ చేశాడు రవి. వాటిలో పైరసీ సినిమాలను అప్ లోడ్ చేసి సినిమా ఇండస్ట్రీకి వేలాది కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్ తో రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అలాగే పైరసీ గుట్టు లాగేందుకు పోలీసులు కూడా అతనని విచారిస్తున్నారు. ఐ బొమ్మ రవి అరెస్ట్ పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు చాలా మంచి పని చేశారంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే సమయంలో బయట, సోషల్ మీడియాలోనూ ఐ బొమ్మ రవికి చాలా మంది సపోర్టుగా నిలుస్తున్నారు. రవి కారణంగానే తాము ఇంట్లో ఫ్రీగా సినిమాలు చూశామని, అతను రియల్ హీరో అని, రాబిన్ హుడ్ అని బిరుదులు ఇచ్చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణలో ఐబొమ్మ రవి గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐ బొమ్మ ద్వారా రవి జనాలను బెట్టింగ్ యాప్స్ కి తరలించడం, మన డేటాను తీసుకొని డార్క్ వెబ్ కి అమ్మడం, హవాలా చేయడం.. లాంటి ఇల్లీగల్ పనులతో కోట్లు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడది నిజమైంది. తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించనున్నారు. రవి బాల్యం, ఫ్యామిలీ, ఆటు పోట్లు, ఐ బొమ్మని ఎలా మొదలుపెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్.. వంటి అంశాలతో ఐ బొమ్మ రవి బయోపిక్ ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

టైటిల్ పోస్టర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.