Hyper Aadi: హైపర్ ఆదిలో ఇంత టాలెంట్ ఉందా..! ఏం పాడాడు భయ్యా..!! అదరగొట్టేశాడు

జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నారు ఆది. తనదైన కామెడీ పంచులతో అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షోలో టీం లీడర్ అయ్యాడు. తన స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి ఆది చేరారు. అటు జబర్దస్త్.. షో ఆడియన్స్‏ను కడుపుబ్బా నవ్వించిన ఆది.. […]

Hyper Aadi: హైపర్ ఆదిలో ఇంత టాలెంట్ ఉందా..! ఏం పాడాడు భయ్యా..!! అదరగొట్టేశాడు
Aadi

Updated on: May 18, 2025 | 11:50 AM

జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నారు ఆది. తనదైన కామెడీ పంచులతో అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షోలో టీం లీడర్ అయ్యాడు. తన స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి ఆది చేరారు. అటు జబర్దస్త్.. షో ఆడియన్స్‏ను కడుపుబ్బా నవ్వించిన ఆది.. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలోనూ తన కామెడీతో అలరించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుండగా.. ఇంద్రజ జడ్జ్ గా చేస్తున్నారు. ఈ కామెడీ షోలో ఆది పంచ్‌లు.. తోటి కంటెస్టెంట్స్ పై ఆది వేసే జోక్స్ ఆడియన్స్‏ను కడుపుబ్బా నవ్విస్తాయి.

అటు టీవీషోలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు ఆది. ఇటీవల ఆయన వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు ఆది. ఇదిలా ఉంటే ఆదిలో మరో టాలెంట్ కూడా ఉంది. తాజాగా ఆదికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఆది అద్భుతంగా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఓల్డ్ వీడియో కాగా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆది ఓ కారులో ప్రయాణిస్తుండగా.. నా ఆటోగ్రాఫ్ సినిమాలోని పాటప్లే అయ్యింది. వెంటనే ఆది ఆ పాటను అందుకొని ఆలపించాడు. నా ఆటోగ్రాఫ్ సినిమాలోని నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని అనే సాంగ్ ను ఆది పాడాడు. అలాగే ఆ పాటను కొనియాడాడు. ఎంతో అద్బుతమైన పాట .. గొప్పగా రాశారు. యేసుదాస్ వాళ్ళ అబ్బాయి విజయ్ యేసుదాస్ అద్భుతంగా పాడాడు.. నెక్స్ట్ లెవల్ అని అన్నాడు ఆది. ఇక ఆది పాట విన్న నెటిజన్స్ “నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఈ సాంగ్ తో సెట్ లో ట్రై చెయ్”, ” ఆది అన్న నువ్వు ఒకసారి టీవీ షోలో ఈ సాంగ్ పాడు అన్న వినాలనిపిస్తుంది.. నువ్వు పాడాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.