Prabhas: ప్రభాస్‌ కారును ఆపిన పోలీసులు.. బ్లాక్‌ ఫిల్మ్‌ తొలగించి జరిమానా విధింపు..

|

Apr 16, 2022 | 4:17 PM

Hyderabad: ట్రాఫిక్‌ నియమాలు, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై హైదరాబాద్‌ (Hyderabad) ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Prabhas: ప్రభాస్‌ కారును ఆపిన పోలీసులు.. బ్లాక్‌ ఫిల్మ్‌ తొలగించి జరిమానా విధింపు..
Prabhas Car
Follow us on

Hyderabad: ట్రాఫిక్‌ నియమాలు, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై హైదరాబాద్‌ (Hyderabad) ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలకు ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై ఫైన్లు వేస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ జరిమానాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌కు చెందిన ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, కల్యాణ్‌ రామ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తదితరుల వాహనాలకు ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు వేశారు. అంతేకాదు అక్కడికక్కడే వారి కార్లకున్న బ్లాక్‌ ఫిలింలను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కూడా చేరిపోయాడు.

నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ -36లో నీరూస్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళుతోన్న ఓ కారు వారి కంటపడింది. కారును ఆపి తనిఖీ చేయంగా.. ఆ కారు నటుడు ప్రభాస్‌దిగా తేలింది. నంబర్ ప్లేట్‌ సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్‌ ఫ్రేమ్‌ ఉండడంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 చలానా వేశారు. కారు అద్దాలకున్న బ్లాక్‌ ఫిల్మ్‌ను కూడా తొలగించారు. అయితే పోలీసులు జరిమానా విధించిన సమయంలో ప్రభాస్‌ కారులో లేరు.

Also Read:TSPSC Groups Notification 2022: గ్రూపు 2, 3 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ.. మొత్తం 1955 ఉద్యోగాల భర్తీకి ..
Sreeja Konidela: వైరల్‌గా మారిన చిరంజీవి కూతురు పోస్ట్‌.. ఎదుటి వారికి ఏది ఇస్తే అదే వస్తుందంటూ..

MI vs LSG Live Score, IPL 2022: మొదటి వికెట్‌ కోల్పోయిన లక్నో.. వెనుదిరిగిన క్వింటన్‌ డి కాక్‌..