Indra Re-Release: ఇది బాస్ రేంజ్.. నిమిషాల్లో వేల టికెట్లు సేల్.. ఇంద్రుడి ఆగమనానికి మీరు రెడీనా

చిరు బర్త్ డే (ఆగస్ట్ 22) స్పెషల్‌గా ఇంద్ర సినిమాను ఆగస్ట్ 22న రీ రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇంద్ర రీ రిలీజ్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే.. రికార్డుల బద్దలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల షోలు.. హౌస్ ఫుల్స్ అయ్యాయి.

Indra Re-Release: ఇది బాస్ రేంజ్.. నిమిషాల్లో వేల టికెట్లు సేల్.. ఇంద్రుడి ఆగమనానికి మీరు రెడీనా
Chiranjeevi

Updated on: Aug 18, 2024 | 8:41 PM

థియేటర్లలో ఇంద్రసేనారెడ్డి బీభత్సానికి సమయం దగ్గరవుతుంది.  చిరు అభిమానులు పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అయిపోతున్నారు. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్ అవ్వనుంది. దీంతో సినిమా టికెట్లను దక్కించుకునేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రదేశాలలో హౌస్‌ఫుల్ సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2002లో విడుదలైన ఇంద్ర చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మెగాస్టార్‌గా చిరంజీవి స్థాయిని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ ఫిలిమ్స్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రంలో సోనాలి బింద్రే, దివంగత ఆర్తి అగర్వాల్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, శివాజీ వంటివారు అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ఆయువు పట్టు మణిశర్మ. ఆయనకు సినిమాకు అద్భుమైన పాటలను అందించారు.

4K రీ-రిలీజ్ నేపథ్యంలో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. హైద్రాబాద్‌లోని చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి.  శ్రీరాములు, సంధ్య, భ్రమరాంబ వంటి థియేటర్లో వేసిన షోలకు సంబంధించిన టికెట్లు నిమిషాల వ్యవధిలో సేల్ అయ్యాయి. అటు ఏపిలోని చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉందని రిపోర్టులు అందుతున్నాయి.  టోటల్‌గా 24 గంటల్లోనే 12 వేలకు పైగా టికెట్లు సేల్ అయినట్టు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్‌లు వేగంగా నిండిపోవడంతో థియేటర్ల సంఖ్య పెంచేందుకు ట్రై చేస్తున్నారు. ఈ పరిస్థితులను చూసి.. రెండు దశాబ్దాల క్రితం “మెగా మాస్ హిస్టీరియా” మళ్లీ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిగువన వీడియో ఆర్టికల్ చూడండి….