ఈ మధ్య ఇండస్ట్రీలో రీ రిలీజ్ల హంగామా నడుతోంది. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా దేవర సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే చాలా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అలాగే మరో వైపు ఓటీటీల్లోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. ఇక కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కంటే రీ రిలీజ్ లోనే కలెక్షన్స్ ఎక్కువ సాధించాయి. హిట్ సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి మెప్పించాయి. తమ ఫేవరేట్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ కంటే రీ రిలీజ్ ఎల్లో ఎక్కువ వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమానే హారర్ థ్రిల్లర్ తుంబాడ్. ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. మైథలాజికల్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్ అయిన సమయంలో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీని చాలా మంది చూసి ఇష్టపడ్డారు.
ఇప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. ఈ క్రమంలో తుంబాడ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్లో తుంబాడ్ సినిమా దుమ్మురేపింది. ఈ తుంబాడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఏకంగా ఈ సినిమా రీ రిలీజ్లో రూ. 30కోట్లు వసూల్ చేసింది. 2018లో చిన్న సినిమాగా విడుదలైన ‘తుంబాడ్’ అప్పుడు కేవలం రూ. 12కోట్లు రాబట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్లో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలో రీ రిలీజ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి