Salaar Movie: ఆ రూమర్స్ పై స్పందించిన సలార్ టీం.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇటీవల కొన్ని రూమర్స్ టెన్షన్ కలిగించాయి. సలార్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం నడిచింది.

Salaar Movie: ఆ రూమర్స్ పై స్పందించిన సలార్ టీం.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
Salaar Movie
Follow us

|

Updated on: May 26, 2024 | 2:04 PM

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ఆ స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా సలార్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇటీవల కొన్ని రూమర్స్ టెన్షన్ కలిగించాయి. సలార్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం నడిచింది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని.. దీంతో సలార్ 2 ప్రాజెక్ట్ రద్దు అయ్యిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఆ రూమర్స్ పై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. సలార్ సెట్స్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించిన ఫోటోను షేర్ చేస్తూ.. వీరు నవ్వకుండా ఉండలేరు అంటూ పరోక్షంగా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోయే సలార్ 2 ప్రాజెక్టుకు శౌర్యాంగ పర్వం టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకే మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 27న డార్లింగ్ నటిస్తున్న కల్కి ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది చిత్రయూనిట్. ఇందులో దిశా పటానీ, దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
ఐటీ ఫైల్‌ చేసే వారికి అలెర్ట్‌..కేంద్రం నిర్ణయంపైనే ఆశలన్నీ..!
ఐటీ ఫైల్‌ చేసే వారికి అలెర్ట్‌..కేంద్రం నిర్ణయంపైనే ఆశలన్నీ..!
మీ బైక్‌కి మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే..
మీ బైక్‌కి మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే..
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల
పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!
పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!
ఆ హీరోని కౌగిలించుకున్న రంభ .. కోపంతో రగిలిపోయిన రజినీకాంత్
ఆ హీరోని కౌగిలించుకున్న రంభ .. కోపంతో రగిలిపోయిన రజినీకాంత్
ఆపద వేళ ఆర్థిక భరోసా.. ఆ ప్రత్యేక లోన్‌ సదుపాయంతోనే సాధ్యం
ఆపద వేళ ఆర్థిక భరోసా.. ఆ ప్రత్యేక లోన్‌ సదుపాయంతోనే సాధ్యం
ప్రతి రోజూ ఇంగువ తీసుకుంటే శరీరంలో జరిగేది ఇదే..
ప్రతి రోజూ ఇంగువ తీసుకుంటే శరీరంలో జరిగేది ఇదే..
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి