మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన హిట్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమాలో శేష్ ప్రధాన పాత్రలో నటించారు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. శేష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపినింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా హిట్ 2 నిలిచింది. ఫస్ట్ డే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 6.34 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.96 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్..రూ. 1.95 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు హిట్2 హావా కొనసాగింది. ముఖ్యంగా వీకెండ్ కావడంతోఈ సినిమా కలెక్షన్స్ రెట్టింపు అయ్యాయి.
నివేదికల ప్రకారం హిట్ 2 సినిమా రెండవ రోజు రూ. 12.67 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. నైజాంలో రూ. 1.74 కోట్లు.. సీడెడ్ రూ. 36 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రా.. తెలంగాణలో రూ. 7.31 కోట్లు షేర్.. రూ. 11.90 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 19.15 కోట్లు గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
గతంలో సూపర్ హిట్ అందుకున్న హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది హిట్ 2. ఇక త్వరలోనే హిట్ 3 కూడా రాబోతుందని తెలియజేశారు మేకర్స్. ఇందులో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.