Bhagavanth Kesari OTT : హిందీలో అదరగొట్టిన బాలయ్య.. భగవంత్ కేసరికి ఊహించని రెస్పాన్స్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన స్టైల్ మార్చి తీసిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలకృష్ణ మరో సారి తన నట విశ్వరూపం చూపించారు. భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. అలాగే ఈ సినిమా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటించి మెప్పించింది.

Bhagavanth Kesari OTT : హిందీలో అదరగొట్టిన బాలయ్య.. భగవంత్ కేసరికి ఊహించని రెస్పాన్స్
Bhagavanth Kesari

Updated on: Nov 25, 2023 | 4:18 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నయా మూవీ భగవంత్ కేసరి. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన స్టైల్ మార్చి తీసిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలకృష్ణ మరో సారి తన నట విశ్వరూపం చూపించారు. భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. అలాగే ఈ సినిమా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటించి మెప్పించింది. అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భగవంత్ కేసరి సినిమాను ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి సినిమా ఈ నెల 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భగవంత్ కేసరి సినిమా పాన్ ఇండియా లెవల్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ కేసరి సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే హిందీలో బాలకృష్ణ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. ముందుగానే హిందీలో తానే సొంతంగా డబ్బింగ్ చెప్తున్నా అని చెప్పిన బాలయ్య. నిజంగానే అదరగొట్టారు. బాలయ్య చెప్పిన డైలాగ్స్ కు హిందీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. హిందీలో ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరు బాలయ్య డైలాగ్ డెలివర్ కు ఫిదా అవుతున్నారు. ఓటీటీలోనూ భగవంత్ కేసరి సినిమా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.