Hi Nanna OTT : అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి..? హాయ్ నాన్న స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా..

|

Dec 29, 2023 | 4:21 PM

తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే హాయ్ నాన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది.

Hi Nanna OTT : అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి..? హాయ్ నాన్న స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా..
Hi Nanna
Follow us on

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతర్వాత నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. శౌర్యవ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే హాయ్ నాన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమాను జనవరిలో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో హాయ్ నాన్న సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఫ్యాన్స్ రేటుకు హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని టాక్. ఇక ఈ సినిమాను జనవరి 12 సంక్రాంతి కానుకగా లేదా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అనుకున్నదానికంటే ముందే గానే అంటే జనవరి 5న హాయ్ నాన్న సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

నాని ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి