జగ్గుభాయ్ సినిమా నుంచి మరో సాంగ్ రివీల్.. ‘హే హుడియా ప్రేమలో పడిపోయా’ అంటూ…

|

Feb 01, 2021 | 7:55 PM

జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా  'FCUK(ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్)'. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.

జగ్గుభాయ్ సినిమా నుంచి మరో సాంగ్ రివీల్.. హే హుడియా ప్రేమలో పడిపోయా అంటూ...
Follow us on

FUCK Movie: జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా  ‘FCUK(ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్)’. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, సహశ్రిత ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 12న థియేటర్లోకి రానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‏కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమాను వరుసగా సాంగ్స్ విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా హే హుడియా అనే పాటను రివీల్ చేశారు.

“హే హుడియా ప్రేమలో పడిపోయా.. ఈ గడియా ప్రేమికుడైపోయా.. ఓ చెలియా నీదే ఈ మాయ.. నా సఖియా నిజమా ఇది కలయా..” అంటూ ఈ సాంగ్ సాగింది. భీమ్ సిసిరీలియో స్వరాలు సమకూర్చగా.. షాహిద్ తన గాత్రాన్ని అందించాడు. ఈ సాంగ్ వీడియోను ఫిబ్రవరి 6న విడుదలచేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రంలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్ కీలక పాత్రలో నటించారు. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్. దామోదర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.