Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విభిన్న కథాంశాలతో అటు హీరోగా, ఇటు దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు. ఇదెలా ఉంటే.. గతంలో ఉపేంద్రతో ప్రేమంటూ వచ్చిన రూమర్స్ పై ఓ సీనియర్ హీరోయిన్ రియాక్ట్ అయ్యింది. అలాగే తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
Upendra

Updated on: Dec 28, 2025 | 8:31 AM

సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. ఈమధ్యకాలంలో హీరోహీరోయిన్స్ ప్రేమ, పెళ్లి విషయాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో ఓ హీరోయిన్ నటుడు ఉపేంద్రతో ప్రేమలో ఉందంటూ ప్రచారం జరిగింది. తాజాగా సదరు హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రూమర్స్ పై స్పందించారు. ఆమె మరెవరో కాదు.. ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరుగాంచిన నటి ప్రేమ. 1995లో తెలుగులో అడుగుపెట్టిన ప్రేమ, 23 ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి ప్రవేశించి, తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఆమె గుర్తింపు పొందారు. తెలుగు భాష నేర్చుకోవడం తనకు ఎంతో కష్టంగా ఉండేదని, దర్శకుడు కోడి రామకృష్ణ గారి సహకారంతోనే తాను తెలుగులో డైలాగులు చెప్పడం నేర్చుకున్నానని ప్రేమ తెలిపారు. వెంకటేష్, మోహన్‌ బాబు, జగపతి బాబు వంటి అగ్ర హీరోలతో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని గుర్తుచేసుకున్నారు. .

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ఎవర్‌గ్రీన్ బ్యూటీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ప్రేమ ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1995లో తెలుగులో అరంగేట్రం చేసిన ప్రేమ ఇప్పటికీ కూడా చెక్కుచెదరని అడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది ప్రేమ. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు తనపై అభిమానం తగ్గలేదని, అందుకు తన ఎంపిక చేసుకున్న కథలే కారణమని పేర్కొన్నారు. తాను నటించిన ధర్మ చక్ర, ఓంకారం, పోలీస్ పవర్, దేవి వంటి చిత్రాల ఆమె కెరీర్ మలుపు తిప్పాయి. నిజానికి తాను హీరోయిన్‌ కావాలని అనుకోలేదని, ఓం సినిమా తర్వాత పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానియ.. ఎయిర్ హోస్టెస్‌గా మారాలని భావించానని ప్రేమ వెల్లడించారు. తన తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చానని, తొలి కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఓం భారీ విజయం సాధించడంతో, జీవితంలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చిత్ర పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేని తానూ ఎన్నో కష్టాలు పడ్డానని, తన తండ్రికి కూడా మొదట ఇష్టం లేదని, తర్వాత తన విజయాలను చూసి ప్రోత్సహించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

అయితే ఒకప్పుడు తాను హీరో ఉపేంద్రతో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. ఉపేంద్రతో రిలేషన్ అంటూ వచ్చిన వార్తలు ఎలా వచ్చాయో తెలియదని.. ఎవరూ తనను కానీ.. ఉపేంద్రను కానీ ఈ విషయం గురించి ప్రశ్నించలేదని అన్నారు. నిజాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేశారని.. ఈ రూమర్స్ గురించి ఉపేంద్ర ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ప్రేమ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి.

Prema, Upendra

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.