Actor Yash: కేజీఎఫ్ సినిమా రికార్డును ఆ సినిమా బీట్ చేయాలి .. ఎమోషనల్ అయిన హీరో యశ్

ఎంతో ఫిట్‏నెస్‏గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికంగా షేర్ చేసుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తారు.

Actor Yash: కేజీఎఫ్ సినిమా రికార్డును ఆ సినిమా బీట్ చేయాలి .. ఎమోషనల్ అయిన హీరో యశ్
Yash

Edited By:

Updated on: Oct 25, 2022 | 4:35 PM

పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్‏నెస్‏గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికంగా షేర్ చేసుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు పునీత్. ఆయన చివరి చిత్రం జేమ్స్ పునీత్ మరణించిన తర్వాత రిలీజ్ అయ్యింది.

అలాగే ఇప్పుడు పునీత్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధద గుడి’ అక్టోబర్ 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మె పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హీరో యశ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. హీరో యశ్ మాట్లాడుతూ తన చిత్రం ‘కేజీఎఫ్’ రికార్డులను ‘గంధన గుడి’ సినిమా బ్రేక్ చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ‘గంధన గుడి’ చిత్రాన్ని పునిత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్లో అతడి భార్య అశ్వినీ పునిత్ రాజ్ కుమారే నిర్మించారు. ఈ చిత్రానికి అమోఘ వర్ష దర్శకత్వం వహించారు.