Vishal : ఆర్య పేరు నేనే సజెస్ట్ చేశాను.. అప్పుడు దర్శకుడు ఏమన్నాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్..

|

Nov 04, 2021 | 6:04 PM

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు.

Vishal : ఆర్య పేరు నేనే సజెస్ట్ చేశాను.. అప్పుడు దర్శకుడు ఏమన్నాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్..
Vishal
Follow us on

 

Enemy : యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.  “దర్శకుడు ఆనంద్ శంకర్ నాకు పరిచయమే లేదు. ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి కథ చెపుతానన్నారు. అప్పుడు ఆయన చేసిన నోటా, ఇరుముగళ్ సినిమాలు చూశాను. తర్వాత జస్ట్ కథ విన్నాను. నేను హీరోగా కథ వినలేదు. కేవలం ఒక ప్రేక్షకుడిగా కథ విన్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అన్నారు.

కథ వినగానే ఇదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనిపించింది. మరో రోల్ కోసం నా మిత్రుడు ఆర్య పేరును సజెస్ట్ చేశాను. నేను ఇచ్చే సలహాను ఆయన తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. కానీ నేను ఇగోకు పోకుండా నాకు అనిపించిన దాన్ని ఆయనకు చెప్పాను. ఆయన వెంటనే షాక్ అయ్యారు. ‘సార్.. నేను నిజంగా ఊహించలేదు. మీరు ఇంకో హీరోకు ఇంత ప్రెజెన్స్ ఇస్తారని.’ అని చెప్పారు. అప్పుడు ఆర్య రోల్ ఇంకాస్త పెంచమని చెప్పాను. అలాగే ఆర్య రోల్ రీరైట్ చేసి అతనికి కూడా కథ చెప్పారు. ఆర్య వెంటనే ఒప్పుకున్నాడు. ఆ ఫైనల్ స్క్రిప్ట్ విన్నాక షూటింగ్ ఎప్పుడెప్పుడా అనిపించింది. నిజంగా స్టోరీ అంత ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు విశాల్. చాలా తక్కువ సినిమాలకు మంచి టెక్నీషియన్స్, మంచి కాస్ట్ దొరుకుతారు. కొన్ని సినిమాల్లో వీళ్లు కాకుండా వీళ్లు ఉంటే బాగుండేది అని సినిమా అయిపోయాక అనిపించేది. కానీ ఈ సినిమా విషయంలో అలాంటిదేమీ అనిపించలేదు. నిజంగా ఇది డ్రీమ్ టీమ్. అందరూ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు అన్నారు విశాల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sooryavanshi: ‘సూర్యవంశీ’లో ఎంఎస్ ధోని.. ఆసక్తి రేకిత్తిస్తోన్న గుల్షన్ గ్రోవర్ సీక్రెట్ పోస్ట్

Kalyan Dev’s Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సూపర్ మచ్చి’.. ఆకట్టుకుంటున్న టీజర్

Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’