Vishal : షూటింగ్‌‌లో ప్రమాదం.. ఇంచ్‌ దూరంలో చావు కనిపించిందన్న హీరో విశాల్

|

Feb 22, 2023 | 8:54 PM

ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా చేసే విశాల్ మూవీ షూటింగ్ లో ఇప్పుడు ప్రమాదం జరగడం అభిమానులను కలవరపెడుతోంది. విశాల్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.

Vishal : షూటింగ్‌‌లో ప్రమాదం.. ఇంచ్‌ దూరంలో చావు కనిపించిందన్న హీరో విశాల్
Vishal
Follow us on

హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో ప్రమాదం జరిగింది. విశాల్ షూటింగ్ లో ప్రమాదాలు జరగడం తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు ఆయన షూటింగ్స్ లో గాయపడ్డారు కూడా. అయితే ఈసారి విశాల్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా.. ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా చేసే విశాల్ మూవీ షూటింగ్ లో ఇప్పుడు ప్రమాదం జరగడం అభిమానులను కలవరపెడుతోంది. విశాల్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. దీంట్లో భాగంగా ఓ ఫైట్‌ సీన్‌ తీస్తున్నారు.  దీని కోసం ఫైట్‌మాస్టర్స్‌ అంతా రెడీ చేశారు.. కానీ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు యాక్షన్‌ చెప్పాక వాహనం ఒక్కసారిగా ఫైటర్లపైకి దూసుకొచ్చేసింది. ఆ టైమ్‌లో సీన్‌లో విశాల్‌తో పాటు చాలా మంది ఫైటర్స్ ఉన్నారు..

విశాల్‌ నెలపై మోకాళ్లపై ఉన్నారు. గోడను వెహికిల్‌ ఢీకొట్టినప్పుడు బ్లాస్ట్‌ జరిగింది. తర్వాత వాహనం అక్కడ ఆగిపోవాలి కానీ ఏం జరిగిందో తెలియదు. ఆగకుండా ముందుకు దూసుకు వచ్చింది. క్షణాల్లోనే అప్రమత్తమై అంతా పక్కకు పరుగులు పెట్టారు.అయినా ఓ నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు.

టెక్నికల్‌ ఇష్యూ వల్లే ఇలా జరిగిందని యూనిట్‌ సభ్యులు చెప్పారు. చాలా లక్కీగా విశాల్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియోని విశాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కొన్ని ఇంచ్‌ల దూరంలో చావు కనిపించిందంటూ కామెంట్‌ చేశారు. తర్వాత షూటింగ్‌ యాధావిధిగా కొనసాగిందన్నారు విశాల్‌. చెన్నై శివారులోని EVP ఫిలింసిటీలో విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోనీ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆస్పాట్‌లో జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పినా.. ఈ అపశృతితో చిత్ర యూనిట్‌ మొత్తం షాక్‌కి గురైంది.