Vishal Marriage: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన విశాల్.. ఆగస్టు 29న ఈ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్..

పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్తం (తెలుగులో రత్నం) సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్.

Vishal Marriage: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన విశాల్.. ఆగస్టు 29న ఈ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్..
Vishal

Updated on: May 20, 2025 | 6:44 AM

తమిళ్ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అయితే ఈ మధ్య విశాల్ పేరు వార్తల్లో తెగ వినిపిస్తుంది. ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో విశాల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు.. జ్వరం వల్లే అలా అయ్యారని ఆతర్వాత విశాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిన్నటికి నిన్న ఓ ఈవెంట్ లో కాళ్లు తిరిగి పడిపోయాడు.

ఇక ఇప్పుడు విశాల్ పెళ్లి గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటి నుంచో విశాల్ పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా విశాల్ వివాహం పై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక. అంతే కాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి సినిమాలో హీరో కూతురిగా నటించింది ధన్సిక. ఆ తర్వాత తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిందీ అందాల తార ప్రస్తుతం తమిళ్ లో సినిమాలు చేస్తుంది.

సాయి ధన్సిక ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.