Actor Chiyaan Vikram: నిలకడగా హీరో విక్రమ్ ఆరోగ్య పరిస్థితి..హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది

|

Jul 08, 2022 | 6:00 PM

విక్రమ్ పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్ ను వైద్య సిబ్బంది రిలీజ్ చేశారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడుతున్న విక్రమ్ కు స్పెషల్ వైద్య సిబ్బంది చికిత్సనందిస్తున్నారని.. ఎటువంటి కంగారు పడాల్సిన పనిలేదని చెప్పారు.

Actor Chiyaan Vikram: నిలకడగా హీరో విక్రమ్ ఆరోగ్య పరిస్థితి..హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది
Hero Vikram
Follow us on

Actor Chiyaan Vikram: ప్రముఖ నటుడు విక్రమ్ అస్వస్థతతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉల్కి పడింది. ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కావేరి ఆస్పత్రి సిబ్బంది విక్రమ్ పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడుతున్న విక్రమ్ కు స్పెషల్ వైద్య సిబ్బంది చికిత్సనందిస్తున్నారని.. ఎటువంటి కంగారు పడాల్సిన పనిలేదని చెప్పారు. త్వరలో విక్రమ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది.

Whatsapp Image 2022 07 08 At 5.37.34 Pm

వాస్తవానికి విక్రమ్ చెన్నైలో సాయంత్రం 6 గంటలకు పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్‌లో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన మహాన్‌లో కనిపించాడు. ఇందులో విక్రమ్ తనయుడు నటుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

విక్రమ్ వరస సినిమాలను లైన్ లో పెట్టాడు. మణిరత్నం దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్, కోబ్రా,  దర్శకుడు పా రంజిత్‌తో కొత్త చిత్రంతో సహా అనేక చిత్రాల్లో నటిస్తున్నాడు. నిర్మాణంలో వివిధ దశల్లో పలు చిత్రాలు ఉన్నాయి.

విక్రమ్ హీరోగా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన కోబ్రా ఆగష్టు 11న రిలీజ్ కానుంది.  పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30 న విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..