Hero Vikram: నటన, కష్టపడే తత్వం, ఇమేజ్ అన్నీ ఉన్నా హిట్ మాత్రం దక్కడం లేదు.. విక్రమ్‌కు విచిత్ర పరిస్థితి

|

Feb 06, 2021 | 2:17 PM

ఎలాంటి క్యారెక్టర్‌ అయినా ఈజ్‌తో పర్ఫామ్‌ చేసే టాలెంట్‌.... ఇమేజ్‌ బ్యారియర్స్‌లో ఇరుక్కోని కెరీర్‌... వర్సటైల్‌ స్టార్ అన్న క్రెడిట్‌.. ఇన్నీ ఉన్నా చియాన్ విక్రమ్‌ కెరీర్‌లో...

Hero Vikram: నటన, కష్టపడే తత్వం, ఇమేజ్ అన్నీ ఉన్నా హిట్ మాత్రం దక్కడం లేదు.. విక్రమ్‌కు విచిత్ర పరిస్థితి
Follow us on

Hero Vikram:  ఎలాంటి క్యారెక్టర్‌ అయినా ఈజ్‌తో పర్ఫామ్‌ చేసే టాలెంట్‌…. ఇమేజ్‌ బ్యారియర్స్‌లో ఇరుక్కోని కెరీర్‌… వర్సటైల్‌ స్టార్ అన్న క్రెడిట్‌.. ఇన్నీ ఉన్నా చియాన్ విక్రమ్‌ కెరీర్‌లో ఇంకా ఏదో మిస్‌ అయ్యింది. టాప్ హీరో అన్న ట్యాగ్ బెస్ట్ పెర్ఫామర్‌ అన్న ఇమేజ్ ఉన్నా.. విక్రమ్ కెరీర్ టాప్‌ గేర్‌లో మాత్రం ఎప్పుడూ లేదు. కరెక్ట్‌గా మాట్లాడుకోవాలంటే అపరిచితుడు తరువాత విక్రమ్‌.. కెరీర్‌లో సాలిడ్‌ హిట్‌ లేనే లేదు.

అందుకే ఇప్పుడు పొన్నియన్‌ సెల్వన్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు చియాన్‌ ఫ్యాన్స్. ఈ వీక్‌లోనే పొన్నియన్‌ సెల్వన్‌ సెట్‌లో అడుగుపెడుతున్నారు విక్రమ్‌. ఫోక్‌లోర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా విక్రమ్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్ అవుతుందన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్‌.

ఈ సినిమాతో పాటు థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న కోబ్రా, యాక్షన్ డ్రామా ధృవ నక్షత్రం, మైథలాజికల్ మూవీ మహావీర కర్ణ సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది సూపర్ హిట్ అయినా మరోసారి విక్రమ్ హవా మొదలవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చియాన్ ఆర్మీ. మరి విక్రమ్ మరోసారి సత్తా చూపిస్తారా..? ఈ భారీ చిత్రాలు విక్రమ్ కెరీర్‌ను గాడిలో పెడతాయా..? చూడాలి.

Also Read: