Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న అందాల భామ సమంత

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం  లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. డాషింగ్ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న అందాల భామ సమంత
Vijay Devarakonda

Updated on: Mar 20, 2022 | 6:27 PM

Vijay Devarakonda: టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం  లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. డాషింగ్ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకతం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోవిజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. రిలీజ్‌కి ముందే సంచనాలకు తెర తీస్తోంది లైగర్ మూవీ. టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచి మొన్నటి ఫస్ట్ గ్లింప్స్‌ దాకా అన్నీ సినిమాకు క్రేజ్ పెంచే మూమెంట్సే. ఇప్పుడు బైటికొస్తున్న ప్రి-రిలీజ్ బిజినెస్ లెక్కలైతే లైగర్‌ స్టామినాకు శాంపిల్‌పీసెస్‌గా మారాయి. ఈ సినిమా తర్వాత విజయ్ పూరి దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నాడు. జనగణమన అనే టైటిల్ తో ఈ మూవీ తెరెక్కుతుంది . ఈ సినిమా తర్వాత విజయ్ ఓ రొమాంటిక్ సినిమాలో నటించనున్నాడని తెలుస్తుంది. నిజానికి సుకుమార్ తో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా ఊసే వినిపించడం లేదు.

శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నారట. ఈ మూవీని కశ్మీర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరపైకి తీసుకురాబోతున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా సమంత నటించనుందట. గతంలో శివానిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమా చేసింది సమంత. అలాగే మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించింది సామ్. ఇందులో విజయ్ దేవరకొండ ఫొటోగ్రాఫర్ గానూ సమంత సావిత్ర జీవితంపై రీసెర్చ్ చేసే పాత్రికుయురాలిగానూ కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరో సారి ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు. అదికూడా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Sreemukhi: అందాల ముద్దుగుమ్మ హొయలు కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అదిరిన లేటెస్ట్ పిక్స్

Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..