తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నా

తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ. పోలీసులు 24 గంటలపాటు మన కోసం పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు విజయ్‌ దేవరకొండ. పోలీసుల శ్రమను గుర్తించి లాక్‌డౌన్‌కు తమవంతు...

తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నా

Edited By:

Updated on: Apr 11, 2020 | 7:06 PM

తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ. పోలీసులు 24 గంటలపాటు మన కోసం పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు విజయ్‌ దేవరకొండ. పోలీసుల శ్రమను గుర్తించి లాక్‌డౌన్‌కు తమవంతు సహకారం అందించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే కరోనా కంట్రోల్‌లో ఉందని తెలిపారు. సరైన సమయంలో ప్రభుత్వాలు స్పందించకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ సక్రమంగా అమలవుతోందని ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రశంసించారు. శనివారం డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులకు ఫేస్‌ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌తో పాటు హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు శంకర్‌ పాల్గొన్నారు. కరోనాపై పోరాటంలో పోలీసులు చేస్తున్న విశేష కృషికి, సేవకి విజయ్‌ దేవరకొండ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం

మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..