Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్.. పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. సోమవారం (అక్టోబర్ 06) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో..

Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్.. పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
Vijay Devarakonda

Updated on: Oct 06, 2025 | 9:46 PM

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.  ఆదివారం (అక్టోబర్ 05) తన స్నేహితులతో కలిసి కారులో పుట్ట పర్తికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. సోమవారం (అక్టోబర్ 06) హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్‌ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదంలో విజయ్ కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత విజయ్ తన స్నేహితుడి కారులో హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. కాగా ఇటీవల రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగినట్లు ప్రచారం జరిగింది. నిశ్చితార్థం తర్వాత అతను పుట్టపర్తికి వెళ్లాడు. అక్కడ సత్యసాయి సమాధిని దర్శించుకున్నాడు. అనంతరం  తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  అయితే ప్రమాదంలో విజయ్ దేవరకొండ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ప్రమాదంలో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ కారు.. వీడియో..

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం విజయ్  దేవరకొండ ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. గతంలో వీరి కాంబోలో వచ్చిన ట్యాక్సీవాలా సూపర్ హిట్ గా నిలిచింది.  రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన్ అనే సినిమాకు కమిట్ అయ్యాడీ రౌడీ హీరో. వి.కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల గురించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ప్రమాదంపై విజయ్ దేవరకొండ రియాక్షన్..

కారు ప్రమాదం పై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు.’ అంతా బాగానే ఉంది. కారు దెబ్బతింది, కానీ మేమంతా బాగానే ఉన్నాము. స్ట్రెంగ్త్ వర్కౌట్స్ కూడా చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. ఈ వార్త మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయనివ్వకండి’ అని ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.

 

 

Follow Us