
ఒకప్పుడు హీరోగా రాణించిన వారిలో వడ్డే నవీన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోగా రాణించాడు వడ్డే నవీన్. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 90లలో స్టార్ హీరోగా రాణించి.. వరుస హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు. టాలీవుడ్‌లో పేరున్న నిర్మాత వడ్డే రమేష్ తనయుడు నవీన్. 1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు చిత్రంతో అతను విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు ఓ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో వడ్డే నవీన్ క్రేజీ హీరోగా మారిపోయాడు. దాంతో తక్కువ సమయంలోనే బిజీ హీరోగా మారిపోయాడు.
ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, లవ్ స్టోరీ 1999, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010 తర్వాత.. ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. చివరిగా 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో కనిపించారు. ఇక ఇప్పుడు 10ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. కానిస్టేబుల్ త్రిమూర్తులు అనే సినిమాతో రానున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ లో నవీన్ మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తన అనుభవం గురించి పంచుకున్నారు. ఆయన చివరి సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ . ఈ చిత్రంలో నవీన్ ఒక సహాయ పాత్రలో నటించారు. సినిమా షూటింగ్ దాదాపు నాలుగు ఐదు రోజులు ముగిసిన తర్వాత, రామ్ గోపాల్ వర్మ స్వయంగా వడ్డే నవీన్ వానిటీ వ్యాన్‌కు వచ్చారట..వర్మ, నవీన్‌తో మాట్లాడుతూ.. మీరు మంచి లుక్ ఉన్న వ్యక్తి, కానీ మీరు ఇలాంటి పాత్రలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. మీకంటూ ఒక ప్రత్యేకమైన సినిమా ఉండాలి, దానిలో మీరు పని చేయాలి” అని వర్మ చెప్పారట. అప్పటికే నవీన్ కూడా తాను చేస్తున్న పని పట్ల అంత సౌకర్యంగా లేనని, ఇది సరైనది కాదని అనుకున్నారట.. ఎప్పుడైతే ఆర్జీవీ చెప్పిన మాటలతో వడ్డే నవీన్ ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అయితే, పూర్తిగా సినిమాలు మానేయడం కాకుండా, తనకు నచ్చే, ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని తను భావించే మంచి సినిమా వస్తేనే చేస్తానని డిసైడ్ అయ్యారట.. ఇక పై ఎలా ఉంటుందో చెప్పలేనని, వేచి చూడాలని చెప్పుకొచ్చారు వడ్డీ నవ్వీన్.