Thalapathy Vijay: కోటిరూపాయలు విరాళం ఇచ్చిన దళపతి విజయ్.. ఎందుకో తెలుసా..

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తారని టాక్ వినిపిస్తుంది.. అయితే సినిమా ఇండస్ట్రీతో తన రిలేషన్ షిప్ ని మెయింటెయిన్ చేసేందుకు విజయ్ ఓ పెద్ద స్టెప్ తీసుకున్నాడు.

Thalapathy Vijay: కోటిరూపాయలు విరాళం ఇచ్చిన దళపతి విజయ్.. ఎందుకో తెలుసా..
Thalapathy Vijay

Updated on: Mar 13, 2024 | 5:11 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ పోటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తారని టాక్ వినిపిస్తుంది.. అయితే సినిమా ఇండస్ట్రీతో తన రిలేషన్ షిప్ ని మెయింటెయిన్ చేసేందుకు విజయ్ ఓ పెద్ద స్టెప్ తీసుకున్నాడు. తమిళనాడులోని నడిగర్ సంఘం (కళాకారుల సంఘం) కొత్త ఐషారామి భవనాన్ని నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణానికి నటుడు విజయ్ భారీ విరాళం అందించారు. విజయ్ సహాయం చేసినందుకు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నటుడు-నిర్మాత విశాల్ కృతజ్ఞతలు తెలిపారు.

దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన విశాల్ .. ‘ధన్యవాదాలు కేవలం రెండు చిన్న పదాలు, కానీ హృదయపూర్వకంగా సహాయం చేసిన వ్యక్తికి ఇది చాలా పెద్దది. నా అభిమాన నటుడు, అద్భుతమైన వ్యక్తి దళపతి విజయ్ గురించి ఈ మాటలు చెబుతున్నాను. నా సోదరుడు దళపతి విజయ్ SIAA (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మీ సహాయం, మద్దతు లేకుండా కొత్త భవనం పూర్తి కాదని మాకు మొదటి నుండి తెలుసు. ఇప్పుడు మీరు మీ సహాయంతో మాకు ఆజ్యం పోశారు, వీలైనంత త్వరగా పనిని పూర్తి చేయాలనే ఉత్సాహంతో ఉన్నాం ‘ అని విశాల్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. విశాల్ విజయ్‌తో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు.

విజయ్ ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దళపతి విజయ్ తోపాటు కమల్ హాసన్, ఉదయ్ నిధి స్టాలిన్, కార్తి కూడా నడిగర్ సంఘంకు విరాళాలు అందించారు.

విశాల్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

విశాల్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.