Sai Dharam Tej: మెగా మేనల్లుడి హార్ట్ బ్రేక్ అయ్యింది.. ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్.. అసలేమైందంటే

|

Jun 13, 2023 | 6:16 PM

ఆచి తూచి అడుగులేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. రీసెంట్ గా విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవడంతో పాటు భారీ వసూళ్లను కూడా రాబట్టింది.

Sai Dharam Tej: మెగా మేనల్లుడి హార్ట్ బ్రేక్ అయ్యింది.. ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్.. అసలేమైందంటే
Sai Dharam Tej
Follow us on

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో. ఆచి తూచి అడుగులేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. రీసెంట్ గా విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవడంతో పాటు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటాడు. తన తోటి హీరోల సినిమాలను కూడా ప్రోమోట్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

తన హార్ట్ బ్రేక్ అయ్యిందని తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. తనకు అత్యంత ప్రియమైన పెంపుడు జంతువు చనిపోయిందని తెలిపాడు తేజ్. దాంతో తన హార్ట్ బ్రేక్  అయ్యిందని తెలిపాడు. తన పెపుడు కుక్కతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యాడు తేజ్.

తన పెట్ డాగ్ పేరు టాంగో అని అది మృతి చెందిందని తెలిపాడు తేజ్.నిన్ను తలుచుకున్న  ప్రతి సారి నా మనసు ఆనందంతో నిండి పోయేది. ఇప్పుడు నువ్వు లేవనే నిజాన్ని నా మనసు అస్సలు తీసుకోలేక పోతుంది. నేను దిగాలుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను హ్యాపీ చేశావ్. అలాంటి నువ్వు ఇప్పుడు లేవంటే నేను తట్టుకోలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు తేజ్.