Tollywood: సినిమాఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సక్సెస్ అయిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (RaviTeja) ఒకరు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రవితేజ.. ఆ తరువాత హీరోగా సూపర్ సక్సెస్ అయ్యారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా రవితేజతో పాటు తన ఇద్దరు సోదరులు భరత్, రఘులు కూడా సినిమాలు చేసిన వారే. అయితే మాస్ మహారాజా తరహాలో వారు ఆకట్టుకోలేకపోయారు. ఇకపోతే రవితేజ కుమారుడు మహాధన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే మహాధన్ తండ్రితో కలిసి ఓ సినిమాలో నటించాడు కూడా. ఇదిలా ఉంటే మహాధన్ కంటే ముందుగా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. అతనే రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్.
డిఫరెంట్ లవ్ స్టోరీతో..
21 ఏళ్ల మాధవ్ ఏయ్ పిల్లా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. దీనికి దర్శకుడు రమేశ్ వర్మ కథ అందిస్తుండగా.. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రుబల్ షెకావత్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో లక్ష్మి, లక్ష్యం, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన నల్లమలుపు బుజ్జి లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఏ పిల్లా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాధవ్ ఫస్ట్ లుక్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాలో నటించడానికి ముందే మాధవ్ డ్యాన్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అలాగే నటనకు సంబంధించి శిక్షణను కూడా పూర్తి చేశాడు. కాగా మాధవ్ డెబ్యూ ఫిల్మ్ కి సంబంధించిన బాధ్యతలు రవితేజనే దగ్గరుండి చూసుకున్నారట. కథ కూడా ఆయన ఓకే చేశాకే పట్టాలెక్కిందట. మరి మాస్ మహారాజా తరహాలో మాధవ్ ఎలా ఆకట్టుకుంటాడోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు మూవీ మేకర్స్.
Hi everyone,
Here is the first look of my debut film #EyPillaProduced by bujji garu @LNPOfficial
Directed by ludheer ?
Music by @mickeyjmeyer ??Super excited ??? pic.twitter.com/kZlfiv2eQK
— maadhav bhupathiraju (@maadhav_9999) August 9, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..