Gopichand New Movie: ‘అలిమేలుమంగ వేంకటరమణ’గా గోపీచంద్.. అతిధిగా వస్తానంటున్న రానా ?

Gopichand New Movie Update: టాలెంటెడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా 'సీటీమార్'.

Gopichand New Movie: అలిమేలుమంగ వేంకటరమణగా గోపీచంద్.. అతిధిగా వస్తానంటున్న రానా ?
Gopichand Rana

Updated on: Apr 25, 2021 | 3:09 PM

Gopichand New Movie Update: టాలెంటెడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా ‘సీటీమార్’. మాస్ గేమ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ గేమ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లోఇప్పటికే టీజర్ పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై ప్రేక్షకులలో ఓ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.ఇక సీటీమార్ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించింది. హాట్ బ్యూటీ అప్సరా రాణి ఐటెం సాంగ్ చేయడం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమాలో నటించబోతున్నాడు. తేజతో గోపీచంద్ ఇంతకు ముందు ‘జయం, నిజం’ సినిమాల్లో విలన్ గా నటించాడు గోపీచంద్. అయితే ఆయన దర్శకత్వంలో గోపీచంద్ హీరో’గా చేయబోతున్న తొలి సినిమా ఇదే. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రానున్న ఈ సినిమా టైటిల్ రోల్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందట. అందులో రానా దగ్గుపాటి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కేవలం ఒక సీన్ ఉండే ఈ పాత్ర క్లైమాక్స్ లో వస్తుందట. అయితే సినిమాకి ఆ పాత్ర ఎంతో కీలకమట. అందుకే ఈ పాత్ర చేయటానికి రానా ఓకె చెప్పాడట. జూన్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..