Double iSmart: స్పీడ్ పెంచిన డబుల్ ఇస్మార్ట్.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన రామ్

|

Jul 31, 2024 | 4:32 PM

రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమాలో మరోసారి రామ్ మాస్ యాక్షన్ చూడనున్నారు ప్రేక్షకులు..

రామ్ పోతినేని  నటిస్తున్న నయా మూవీ డబుల్ ఇస్మార్ట్ .. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమాలో మరోసారి రామ్ మాస్ యాక్షన్ చూడనున్నారు ప్రేక్షకులు.. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు రామ్. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.