Bimbisara Movie: నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార(Bimbisara). వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సినిమాలో క్యాథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.
Ad
Nandamuri Balakrishna
Follow us on
Bimbisara Movie: నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార(Bimbisara). వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సినిమాలో క్యాథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమాతో చాలాకాలం అందని ద్రాక్షలా ఉన్న సాలిడ్ హిట్‌ను అందుకున్నాడు కల్యాణ్ రామ్. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా క్రమంగా బ్లాక్ బస్టర్ వైపు అడుగులేస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను అధిగమించి భారీ లాభాల దిశగా పయనిస్తోంది. ఇక ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన కనిపించాడు కల్యాణ్‌రామ్. అతని నటనకు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. ఇలా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్లుతోన్న బింబిసార సినిమాను వీక్షించాడు నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna). తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ థియేటర్‌లో ఈ సినిమాను చూశాడు. హీరో కల్యాణ్‌రామ్‌తో పాటు డైరెక్టర్ వశిష్ఠ వారితో ఉన్నారు. ఈ సందర్భంగా బింబిసార చిత్రబృందాన్ని అభినందించారు బాలకృష్ణ. అద్భుతమైన ప్రయత్నమంటూ ప్రశంసలు కురిపించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా కనిపించనున్నారు. ఇంకో పవర్‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపించనుంది. ఇక ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108 ప్రాజెక్టను కూడా అనౌన్స్ చేశారు. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గురించి ఓ స్పెషల్ గ్లింప్స్ ఇచ్చారు మూవీ మేకర్స్.