Kamal Haasan: గురుశిష్యులు మళ్లీ కలిశారు.. కళాతపస్వి ఆశీస్సులు తీసుకున్న కమల్‌.. ట్రెండింగ్‌లో ఫొటోస్‌

|

Nov 24, 2022 | 6:50 AM

ఈ సందర్భంగా విశ్వనాథ్‌ చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కమల హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

Kamal Haasan: గురుశిష్యులు మళ్లీ కలిశారు.. కళాతపస్వి ఆశీస్సులు తీసుకున్న కమల్‌.. ట్రెండింగ్‌లో ఫొటోస్‌
Kamal Haasan,vishwanath
Follow us on

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను కోలీవుడ్ నటుడు కమల్ హాసన్‌ కలిశారు. హైదరాబాద్‌లోని లెజెండరీ డైరెక్టర్‌ ఇంటికెళ్లిన కమల్‌ ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. కొద్దిసేపు ఆయనతో మర్వాదపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకున్నారు.  ఆయన ఆరోగ్యం గురించి  అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కమల హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, గురువుగారిని వాళ్లింట్లో కలిశానని, ఎన్నో మధురస్మృతులను గుర్తుచేసుకున్నామనీ, వారంటే ఎంతో గౌరవమనీ కమల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్‌కు నమస్కరిస్తున్న ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా బాగా వైరలవుతోంది. ఈ ఫొటోని చూసిన వాళ్లు గురుశిష్యుల అపూర్వ సంగమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు లెజండరీ నటుడైతే, మరొకరు లెజండరీ దర్శకుడని ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరనీ ఇలా చూడడం చాలా బాగుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ ఏడాది విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు కమల్ హాసన్. త్వరలోనే ఇండియన్‌ 2 (భారతీయుడు2) సినిమాతో మరో హిట్‌ను కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు కాగా గ్యాప్ రావడంతో బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్, తన గురువు విశ్వనాథ్‌ను కలిశాడు. ఇదిలా ఉంటే కమల్‌, విశ్వనాథ్‌లది హిట్‌ కాంబినేషన్‌. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి క్లాసిక్‌ సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇందులోని స్వాతిముత్యం సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు దక్కాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..