Puri Jagannadh : ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో… డైనమిక్ డైరెక్టర్ మరోసారి ఈ దేశముదురుతో సినిమా చేయబోతున్నాడా..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా అంటే మాములుగా ఉండదు. పూరి డైలాగులకు ఫిదా కానీ యువత ఉండరు. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసాడు పూరి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జునుని దేశముదురుని చేశాడు ఈ డాషింగ్ డైరెక్టర్.

Puri Jagannadh : ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో... డైనమిక్ డైరెక్టర్ మరోసారి ఈ దేశముదురుతో సినిమా చేయబోతున్నాడా..

Updated on: Feb 20, 2021 | 7:12 PM

Puri Jagannadh : డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా అంటే మాములుగా ఉండదు. పూరి డైలాగులకు ఫిదా కానీ యువత ఉండరు. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసాడు పూరి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జునుని దేశముదురుని చేశాడు ఈ డాషింగ్ డైరెక్టర్. ఇప్పటికే దేశముదురుతో పాటు ఇద్దరమ్మాయిలతో సినిమా చేసాడు. తాజాగా ఈ కాంబోలో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది.  పూరి- బన్నీతో మరో సినిమా చేయబోతున్నాడట.. ఇప్పటికే బన్నీకి సిరపోయేలా స్టోరీ ప్రిపేర్‌ చేసిన పూరి.. ఆల్మోస్ట్‌ సినిమాను తెరెకెక్కించినంత రేంజ్‌లో ఆ కథను ఎక్సప్లేన్ చేసేసి.. బన్నీ నోట ఓకేతో పాటు హగ్‌ను కూడా కొట్టేశాడట. ఈ సారి ఇద్దరు అమ్మాయిలతో సినిమా కంటే డిఫరెంట్ లుక్‌లో చూపిస్తానని బన్నీకి ప్రామిస్‌ కూడా చేశాడట పూరి.

అయితే ఈ సినిమాకి సంబంధించిన రూమర్‌ అయితే బయటికి వచ్చింది కాని షూటింగ్‌ మొదలుకావడానికి చాలానే టైం పట్టేలా ఉందట. ఎందుకంటే.. బన్నీ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’తో సహా ఇప్పటికే రెండు సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చే సినిమా కాగా.. మరోటి గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మల్టిలాగ్వేంజ్‌ సినిమా.. ఈ రెండు సినిమాలు కంప్లీట్‌ అయితే కాని పూరికి డేట్లు ఇవ్వలేని పరిస్థితి.. మరోవైపు పూరి కూడా అంతే రేంజ్‌లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ఫ్రీ అయితే కాని ఈ సినిమా మొదలవ్వదు. చూడాలిమరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijayashanti : మరో సినిమా ఒకే చేసిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి.. 21ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్

fire accident in television show set: ప్రముఖ టీవీ షో సెట్‏లో అగ్ని ప్రమాదం.. నటీనటులకు తప్పిన పెను ప్రమాదం..