AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: అజిత్ మెదడులో బబుల్ ఉంది.. కానీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్..

నరాలకు సంబందించిన సమస్యతో అజిత్ బాధపడుతున్నారని కొందరంటుంటే మరికొందరు ఏకంగా బ్రెయిన్ సర్జరీ చేయించుకోబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు వైరల్ కావడంతో అజిత్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు అజిత్ టీమ్.

Ajith Kumar: అజిత్ మెదడులో బబుల్ ఉంది.. కానీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్..
Ajith
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2024 | 8:38 AM

Share

స్టార్ హీరో అజిత్ కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అజిత్ ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. అయితే అజిత్ ఎందుకు ఆసుపత్రిలో చేరారు అన్నదాని పై క్లారిటీ రాలేదు. అయితే నరాలకు సంబందించిన సమస్యతో అజిత్ బాధపడుతున్నారని కొందరంటుంటే మరికొందరు ఏకంగా బ్రెయిన్ సర్జరీ చేయించుకోబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు వైరల్ కావడంతో అజిత్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు అజిత్ టీమ్. అజిత్ హాస్పటల్ లో చేరింది నిజమేనని ఆయన ఇప్పుడు కోలుకున్నారని తెలిపారు. అయితే అజిత్ కు బ్రెయిన్ సర్జరీ గురించి టీమ్ మాట్లాడుతూ..

అజిత్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే అజిత్ కుమార్ మెదడులో బబుల్ ఉందని చెప్పారు. అజిత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. అతని మెదడు, చెవిని కలిపే నరంలో వాపు వచ్చింది. ఇది సాధారణ చికిత్స వాళ్ళ సాల్వ్ అయ్యిందని తెలిపారు . అజిత్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఐసీయూ నుంచి వార్డుకు నడిచాడు’ అని అజిత్ కుమార్ అధికార ప్రతినిధి తెలిపారు.

అజిత్ కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయరాచి’. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. కుటుంబంతో గడిపేందుకు విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు అజిత్. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అజిత్ కుమార్ ‘విడ మూఅరాచి’లో స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. మగిల్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా దేశాల్లో జరుగుతోంది. రెజీనా కసాండ్రా, త్రిష, అర్జున్ సర్జా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us