AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Sri Vidya: రూ.2 వేలతో అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చా.. ఎన్నో మాటలతో బాధపెట్టారు.. జబర్దస్త్ శ్రీవిద్య..

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నటి శ్రీవిద్య ఇటీవల లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో నటిగా ప్రేక్షకులకు దగ్గరైంది. తాజా ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చే సమయంలో పడిన కష్టాలు, కేవలం రూ.2 వేలతో హైదరాబాద్‌కు వచ్చిన విధానాన్ని పంచుకున్నారు. ఇంట్లో ఉన్న రూ.2 వేలతో అర్ధరాత్రి రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చానని చెప్పుకొచ్చింది.

Jabardasth Sri Vidya: రూ.2 వేలతో అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చా.. ఎన్నో మాటలతో బాధపెట్టారు.. జబర్దస్త్ శ్రీవిద్య..
Sri Vidya
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2026 | 7:47 AM

Share

బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వేదికగా నిలిచింది. ఈ షో ద్వారా కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ఒకప్పుడు కేవలం అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసి అలరించిన ఈ వేదికపై, ఇప్పుడు అమ్మాయిలు కూడా తమ కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి శ్రీవిద్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. బి టెక్ పూర్తి చేసిన శ్రీవిద్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చేసిన వీడియోలను చూసిన మేకర్స్ జబర్దస్త్ షోలో అవకాశం ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. అయితే ఇంట్లో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే తీసుకుని, అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి హైదరాబాద్‌కు వచ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రయాణంలో అందులో ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నానని, అప్పుడు తనకు నగరంలో ఎవరూ పరిచయం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని ఆమె తెలిపారు.

శ్రీవిద్య హైదరాబాద్‌లో ఉండటం ఊర్లో చాలామందికి నచ్చలేదు. ఆమె తల్లిని రకరకాలుగా బాధపెట్టారని శ్రీవిద్య గుర్తు చేసుకున్నారు. తండ్రి లేని పిల్లను హైదరాబాద్‌లో ఉంచారని, ఆమె అక్కడ ఏం చేస్తోందో, ఎక్కడ తిరుగుతోందో ఎవరికి తెలుసని మాట్లాడుతూ తల్లిని ఇబ్బంది పెట్టారని ఆమె వెల్లడించారు. అమ్మ ఒంటరిగా ఇబ్బంది పడుతున్న సమయంలో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పారు.

ఇటీవల శ్రీవిద్య ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌లో నటించారు. హర్ష చెముడు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ కామెడీ సిరీస్ అక్టోబర్ 9న ఈటీవీ విన్‌లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌కు బాబు దర్శకత్వం వహించారు. ఇది ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డేటా ప్రకారం, అక్టోబర్ 17 నుంచి 23 మధ్య ఏడు రోజుల్లో ఈ సిరీస్‌ను 8.10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో