AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram: కార్తీక మాసంలో గోదావరి స్నానాలకు వెళ్తున్నారా?.. బీ కేర్‌ఫుల్!

కార్తీక మాసంలో గోదావరి స్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ సమీపంలోని రహదారిపై భారీ మొసలి కనిపించడం కలకలం రేపింది. లారీ డ్రైవర్లు మొసలిని వీడియో తీయగా.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇ

Polavaram: కార్తీక మాసంలో గోదావరి స్నానాలకు వెళ్తున్నారా?.. బీ కేర్‌ఫుల్!
Polavaram Crocodile
B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 14, 2026 | 7:21 AM

Share

కార్తీక మాసం సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలి. పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భారీ మొసలి సంచారం కలకలం రేపుతోంది. ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ సమీపంలోని రహదారిపై ఓ భారీ మొసలి తచ్చాడుతూ వెళ్తున్న దృశ్యాలు స్థానికులను, కార్మికులను భయాందోళనకు గురిచేశాయి.

నిర్మాణ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న లారీ డ్రైవర్లు వాహనాల హెడ్‌లైట్ల వెలుతురులో రోడ్డు దాటుతున్న మొసలిని గుర్తించారు. వెంటనే తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మొసలికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతంలో గోదావరి సహజ ప్రవాహం కొనసాగుతుండటంతో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పరీవాహక గ్రామాల ప్రజలు మంచినీటి అవసరాల కోసం ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా అయ్యప్ప, శివ, వేంకటేశ్వర స్వామి మాలధారణ చేసిన దీక్షాపరులు తెల్లవారుజాము నుంచే నదీ తీరానికి చేరుకుంటున్నారు. ఇలాంటి రద్దీ ప్రాంతానికి సమీపంలోనే మొసలి కనిపించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఘటనపై అటవీ క్షేత్రాధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) ఎస్‌కే వలీ స్పందించారు. పోలవరం ముంపు గ్రామాల తరలింపు పూర్తయిన తర్వాత పాపికొండల అటవీ ప్రాంతంలో జనసంచారం తగ్గిందని, దీంతో గోదావరిలో మొసళ్ల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. సాధారణంగా నదిలో లోతైన ప్రాంతాలు, రాళ్లు, దట్టమైన అటవీ ప్రాంతాలను మొసళ్లు తమ ఆవాసాలుగా చేసుకుంటాయని వివరించారు. ఇటీవల వచ్చిన వరదల ఉద్ధృతికి ఈ మొసలి దిగువ ప్రాంతానికి కొట్టుకొచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరిగి ఎగువన ఉన్న తన ఆవాసానికి చేరుకునే క్రమంలోనే కాఫర్ డ్యామ్ రహదారిపైకి వచ్చి ఉండవచ్చని అంచనా వేశారు.

మొసలి సంచారం నేపథ్యంలో కార్తీక స్నానాలకు వెళ్లే భక్తులు, మత్స్యకారులు, నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, నదిలో స్నానాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. మొసలి సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో