మాజీ ఎంపీ శివప్రసాద్.. సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..!

| Edited By: Pardhasaradhi Peri

Sep 21, 2019 | 4:00 PM

గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో వివిధ వేషధారణలతో వినూత్న నిరసనలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతగా పలు పదవులను దక్కించుకున్నారు. 2009, 2014లలో చిత్తూరు ఎంపీగా గెలుపొందారు. 1999-2004 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఏపీ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ […]

మాజీ ఎంపీ శివప్రసాద్.. సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..!
Follow us on

గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో వివిధ వేషధారణలతో వినూత్న నిరసనలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతగా పలు పదవులను దక్కించుకున్నారు. 2009, 2014లలో చిత్తూరు ఎంపీగా గెలుపొందారు. 1999-2004 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఏపీ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

డాక్టర్ వృత్తిలో ఉన్న ఆయన నటన మీద మోజుతో సీనీ రంగం వైపు అడుగులు వేశారు. నాటకరంగంలో వివిధ పాత్రలు వేసిన ఆయన ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఇక 1983 నుంచి 2013 వరకూ ముప్పైకి పైగా సినిమాల్లో ఆయన నటించారు.

యముడికి మొగుడు, జై చిరంజీవా, డేంజర్ వంటి యాక్షన్ సినిమాల్లోనూ.. యమగోల మళ్లీ మొదలైంది, కితకితలు, కుబేరులు, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వంటి కామెడీ చిత్రాల్లోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వించారు. విలన్ క్యారెక్టర్లలో కూడా ఆయన తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. నటుడిగానే కాకుండా అనేక నాటకాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే.. మరో నాలుగు చిత్రాలకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు.

శివప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమాలు:
1. ప్రేమ తపస్సు
2. టోపీ రాజా స్వీటీ రోజా
3. ఇల్లాలు
4. కొక్కొరొక్కో