Saranya: ఈ నటికి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు.. ఇద్దరూ ఏం చేస్తున్నారంటే?

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శరణ్య ఇప్పుడు సహాయక నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా మెప్పిస్తున్నారు. అయితే సినిమాల పరంగా తప్పితే ఈ నటి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.

Saranya: ఈ నటికి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు.. ఇద్దరూ ఏం చేస్తున్నారంటే?
Actress Saranya

Updated on: Jan 27, 2026 | 7:58 PM

శరణ్య.. ఈ పేరు చెబితే కొందరు గుర్తు పట్టకపోవచ్చు… కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా రఘువరన్ బీటెక్‌ సినిమాలో ఆమె నటననూ ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అలాగే నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ తన అమాయక నటనతో అందరి మన్ననలు అందుకున్నారామె. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సహాయక నటిగా మెప్పిస్తోన్న శరణ్య గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నాయకన్ సినిమాలో హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించారీ అందాల తార. కమల్ హాసన్ తో పోటీ పడి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయకిగా చేశారు శరణ్య. ఆ తర్వాత సహాయక నటిగా మారిపోయారు. ఇప్పటికీ తల్లి, అత్తమ్మ పాత్రలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు శరణ్య. అయితే సినిమాల పరంగా తప్పితే ఈ నటి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.

నటి శరణ్య ప్రముఖ తమిళ్ నటుడు, డైరెక్టర్ పొన్వన్నన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీలో స్థిరపడినప్పటికీ వీరు మాత్రం సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని చాందిని, ప్రియదర్శినీ ఇద్దరూ డాక్టర్లుగా సెటిల్ అయ్యారు. చాందిని గైనకాలజిస్ట్ గా, ప్రియదర్శిని పీడియాట్రిక్స్‌లో పట్టభద్రులయ్యారు. అయితే ఈ స్టార్ కిడ్స్ పెద్దగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండరు. అయితే నటి శరణ్య మాత్రం అప్పుడప్పుడు తన ఇద్దరు కూతుళ్ల ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. చూడడానికి ఇద్దరూ తల్లిలాగే ఉన్నారని, అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరు కూతుర్లతో నటి శరణ్య.. వీడియో వైరల్..

శరణ్య ఫ్యామిలీ ఫొటోస్ మరిన్ని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.