నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. ఆయన ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో. కాస్త వయస్సు మళ్లిన తర్వాత బాహుబలి సినిమాలో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన అయన ఎన్నో తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగు ఆడియెన్స్‌కు చేరువయ్యారు. ఇక బాహుబలితో కట్టప్పగా ఆయనకు ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది. అంత స్టార్ హోదా పొందిన ఆయన మీడియాకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు, కూతురు ఉన్నారన్న విషయం చాలామందికి తెలీదు.
ఇప్పటికే ఆయన కుమారుడు సిబిరాజ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. డోరా, మాయోన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. స్టార్ నటుడి కూతురు అయినప్పటికీ.. ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తరచూ నెటిజన్లకు హెల్త్, లైఫ్ స్టైల్‌పై సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు బయటకు రావడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఆయితే ఆమెకు పాలిటిక్స్‌పై ఇంట్రస్ట్ ఉంది.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.